BIG BREAKING : తమిళనాడు సీఎం ఇంట విషాదం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. ముత్తు తుదిశ్వాస విడిచారు. ముత్తు వయసు 77 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. ముత్తు తుదిశ్వాస విడిచారు. ముత్తు వయసు 77 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
కేంద్రం తమిళనాడుకు రూ.10 వేల కోట్లు ఇచ్చినా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయమని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడం, విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయవ్యవవస్థపై ప్రభావం చూపించే అంశాలు ఇందులో ఉన్నాయన్నారు.
మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. అధికార డీఎంకే ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. దీనికోసం డీఎంకే మంత్రి శేఖర్‌బాబు నిన్న కమల్ తో చర్చలు జరిపారు. కాగా అధికార డీఎంకేతో కమల్ పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
కొత్తగా పెళ్లయిన జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ వ్యాఖ్యానించారు.
ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటనలో జాలీగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్ చేశారు.
తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అయ్యేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్. పార్టీలో దీని గురించి డిమాండ్ పెరుగుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో లేదని చెప్పారు.
తమిళనాడు కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా మరణాల సంఖ్య 58 కు చేరుకుంది. మరో వైపు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు.
టీవల తమిళనాడులో భారీ వర్షాల కారణంగా మొత్తం 31మంది చనిపోయారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతున్న వేళ TN సీఎం స్టాలిన్ ఢిల్లీలో INDIA కూటమి నేతలతో సమావేశం అవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు.
దక్షిణాది ప్రతినిధులతో జరిగిన కూటమి సమావేశంలో బీహార్ సీఎం నితీశ్ సహనం కోల్పోయారు. ఆయన ప్రసంగానికి అనువాదం కావాలని డీఎంకే నేతలు కోరడంతో ఆయనకు కోపం వచ్చింది. హిందీ జాతీయ భాష అంటూ ఫైర్ అయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశానికి జాతీయ భాష లేదు.