Kamal Haasan : ఫిక్స్ .. రాజ్యసభకు కమల్ హాసన్!

మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. అధికార డీఎంకే  ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. దీనికోసం డీఎంకే మంత్రి శేఖర్‌బాబు నిన్న కమల్ తో  చర్చలు జరిపారు. కాగా అధికార డీఎంకేతో కమల్ పార్టీ  పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

New Update
kamal haasan dmk

kamal haasan dmk

Kamal Haasan : మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు.  అధికార డీఎంకే  ఆయన్ను  పార్లమెంటు ఎగువ సభకు పంపాలని నిర్ణయించింది. దీనికోసం డీఎంకే మంత్రి శేఖర్‌బాబు నిన్న కమల్ తో  చర్చలు జరిపారు. సీఎం ఎంకే స్టాలిన్ సూచనల మేరకు శేఖర్ బాబు కమల్‌ను కలిశారు.  ఈ నిర్ణయం2024 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

డీఎంకేతో పొత్తు

2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కమల్ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికార డీఎంకేతో  పొత్తు పెట్టుకున్నారు. అదే సమయంలో, కమల్ 2024 ఎన్నికల్లో డీఎంకే తరపున ప్రచారం చేశారు.  బదులుగా కమల్ ను రాజ్యసభకు పంపిస్తామని సీఎం స్టాలిన్ ఆయనకు హామీ ఇచ్చారు.  మక్కల్ నీది మయ్యం నుంచి కమల్ తో పాటుగా మరోకరికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.  జూలైలో ఖాళీ అయ్యే ఆరు రాజ్యసభ స్థానాల్లో మక్కల్ నీది మయ్యంకు అవకాశం  ఇవ్వనున్నట్లు సమాచారం. 

Also Read: Trump-musk:మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

కాగా కమల్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది జూన్‌లో విడుదల కానుంది. దీనిని కమల్ రాజ్ కమల్ ఫిల్మ్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్ , రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించాయి. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.  

Also Read :  New Ration Card: ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

Also Read :  శ్రీ చైతన్య స్కూల్లో మరో దారుణం.. ఫీజు కట్టలేదని టెన్త్ స్టూడెంట్ను..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు