Stalin: రూ.10 వేల కోట్లు ఇచ్చిన జాతీయ విద్యా విధానం అమలు చేయం: సీఎం స్టాలిన్

కేంద్రం తమిళనాడుకు రూ.10 వేల కోట్లు ఇచ్చినా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయమని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడం, విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయవ్యవవస్థపై ప్రభావం చూపించే అంశాలు ఇందులో ఉన్నాయన్నారు.

New Update
TamilNadu CM MK Stalin

TamilNadu CM MK Stalin

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానాన్ని(NEP) తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు రూ.10 వేల కోట్లు మంజూరు చేసిన అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఎన్‌ఈపీ వల్ల హిందీ భాషను బలవంతంగా రద్దే ప్రయత్నమే కాక.. విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయవ్యవవస్థపై ప్రభావం చూపించే అంశాలున్నాయని అన్నారు. అందుకే తాము ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్‌ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్‌!

భారతీయ భాషల మధ్య అగ్గి రాజేయొద్దని ప్రధాని మోదీ హితబోధ చేసిన సందర్భంగా.. కడలూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. '' మేము ఏ భాషను వ్యతిరేకించడం లేదు. హిందీ కోణంలో మాత్రమే కాదు. ఎన్‌ఈపీని వ్యతిరేకించేందుకు ఇంకా అనేక కారణాలున్నాయి. నీట్‌ లాగే ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాయాల్సి ఉంటుంది.   

Also Read: పెళ్లిచేస్తాం, గిఫ్ట్‌లు ఇస్తామని నమ్మించారు.. చివరికి ఊహించని షాక్

ఇది విద్యార్థులను చదువులు నుంచి దూరం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇప్పుడు వస్తున్న ఆర్థిక సహాయాన్ని కూడా అడ్డుకుంటుంది. ఎన్‌ఈపీని అమలు చేస్తే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తమకు రూ.10 వేలు కోట్లు ఇచ్చినా దీన్ని నేను అంగీకరించను. తమళినాడును రెండు వేల ఏళ్లు వెనక్కి నెట్టే పనిని నేను చేయనని'' స్టాలిన్ అన్నారు. 

Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!

Also Read: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

Advertisment
తాజా కథనాలు