16 మంది పిల్లల్ని కనండి: కొత్త జంటలకు సీఎం స్టాలిన్ సూచన

కొత్తగా పెళ్లయిన జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ వ్యాఖ్యానించారు.

New Update
stalin 2

ఇటీవల సీఎం చంద్రబాబు.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పెళ్లయిన జంటలు 16 మంది పిల్లల్ని కనాలంటూ వ్యాఖ్యానించారు. ఇక వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని హిందూ రిలిజియస్ అండ్ ఎండోమెంట్ బోర్డ్ నిర్వహించిన కార్యక్రమానికి స్టాలిన్ హాజరయ్యారు. ఆయన సమక్షంలో 31 జంటలు పెళ్లి చేసుకున్నారు. 

Also Read: తొలిరోజు గ్రూప్-1 పేపర్ ఎలా ఉందంటే?

16 మందిని కనే సమయం వచ్చింది

ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. కొత్త జంటలు 16 మంది పిల్లల్ని కనే సమయం ఆసన్నమైందని అన్నారు. పూర్వకాలంలో పెద్దలు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు 16 రకాల సంపదలు రావాలంటూ ఆశీర్వాదం చేసేవారని.. కానీ ఇప్పుడు 16 రకాల సంపదలకు బదులు 16 మంది పిల్లల్ని కనే సమయం వచ్చిందన్నారు.ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. 

Also Read: సల్మాన్‌కు ఆ విషయం తెలియదు.. మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు ఏపీలో జనాభా రేటు పెంచేందుకు తమ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని యోచిస్తోందని సీఎం చంద్రాబాబు అన్నారు. దీని ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయగలరని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే చట్టం తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందని కూడా చెప్పారు.  ఇదిలాఉండగా త్వరలో దేశంలో డిలిమిటేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీన్ని అమలు చేస్తే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర భారత్‌కు ఎక్కువ నియోజకవర్గాలు, తక్కువ జనాభా ఉన్న దక్షిణ భారత్‌కు తక్కువ నియోజకవర్గాలు వస్తాయి. దీనివల్ల సౌత్ ఇండియాకు తీరని అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు