/rtv/media/media_files/2025/09/17/sensational-statement-by-maoists-2025-09-17-07-27-16.jpg)
Maoist Party
Maoist Party : సాయుధ పోరాటాన్ని వదిలి ఆయుధాలతో పాటు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలపై ఆ పార్టీ కేంద్రకమిటీ సీరియస్ అయింది. లొంగుబాటుపై పార్టీ కీలక ప్రకటన చేసింది. అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖను విడుదల చేసింది.మల్లోజుల, ఆశన్న విప్లవద్రోహులుగా మారి శత్రువు ఎదుట లొంగిపోయారని అభయ్ ఆరోపించారు. వారికి ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చారు. మల్లోజుల లొంగిపోయే ముందు కేంద్రకమిటీతో చర్చించలేదని వివరించారు. మల్లోజుల, ఆశన్న లు విప్లవద్రోహులుగా మారారని పార్టీ కేంద్ర కమిటీ ఆరోపించింది.
2018లో ఒకసారి పార్టీ తాత్కాళిక వెనుకంజ వేసిందని తెలిపింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయని వివరించింది. విప్లవద్రోహులు మల్లోజుల, ఆశన్నలకు తగిన శిక్ష విధించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. 2020లో కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావాజాలన్ని లేవనెత్తారని ఆరోపించింది.ప్రాణభీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ పార్టీకి ఇది తాత్కాళిక నష్టమే అని వివరించింది. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితంద వాదాన్ని తెరపైకి తెచ్చారని తెలిపింది.కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయారంది. పార్టీకి నష్టం కలిగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: దీపావళి వేళ మార్కెట్లో భారీగా నకిలీ పనీర్.. ఈ సింపుల్ చిట్కాతో ఇట్టే గుర్తు పట్టండి!!
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఏరియా కమిటీ మొత్తం మూకుమ్మడిగా లొంగిపోయేందుకు సిద్ధమని ప్రకటించింది. కేంద్ర కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా తాము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు గరియాబంద్ జిల్లాలోని ఉదంతి ఏరియా కమిటీ ఇన్‌ఛార్జ్ సునీల్ పేరుతో శుక్రవారం ఒక లేఖ విడుదలైంది. "ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. పోరాటం కొనసాగించాలంటే ముందు మనం బతికి ఉండాలి. అందుకే సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాం" అని సునీల్ తెలిపారు. గోబ్రా, సినాపాలి, ఎన్‌టీకేలోని మిగతా యూనిట్లు కూడా తమ ఆయుధాలతో వచ్చి లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు అభయ్, రూపేష్ దాదా, సోనూ దాదా వంటి నేతల నిర్ణయాలను తాము సమర్థిస్తున్నట్లు ఉదంతి ఏరియా కమిటీ తెలిపింది. "కేంద్ర కమిటీ అనేక తప్పులు చేసింది. ఇప్పటికే మనం ఎంతోమంది మిత్రులను కోల్పోయాం" అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వారి నిర్ణయానికి తమ యూనిట్ పూర్తి మద్దతు ఇస్తోందని సునీల్ స్పష్టం చేశారు. లొంగిపోయే విషయంలో ఇతర సహచరులతో సమన్వయం చేసుకునేందుకు ఒక సెల్ నంబర్‌ను (93299 13220) కూడా సునీల్ ఆ లేఖలో ప్రస్తావించడం గమనార్హం. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, ఆయుధాలతో వచ్చి లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ లేఖతో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు శ్రేణుల్లో తీవ్రమైన అంతర్గత విభేదాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది.
Also Read: Chings Add: వామ్మో.. రూ. 150 కోట్లతో యాడ్ షూటా! అట్లీ డైరెక్షన్ లో శ్రీలీల, రణ్‌వీర్ సింగ్!