/rtv/media/media_files/2025/07/15/maoist-top-leader-couple-surrenders-2025-07-15-19-09-38.jpg)
Maoist Top leader couple surrenders
తెలంగాణలో నక్సలైట్ల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుండగా, మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సభ్యుడిగా ఉన్న ఆత్రం లచ్చన్న, బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా ఉన్న ఆత్రం అరుణ మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు. సుమారు ముప్పై సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న లచ్చన్న స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామం.అరుణ స్వస్థలం పెంచికల్ పేట అని తెలుస్తోంది. ఈ లొంగుబాటు పోలీస్ శాఖకు కీలక విజయంగా భావిస్తున్నారు. మావోయిస్టు తలపు నుంచి బయటపడే లైన్‌లో పలువురు ఉన్న నేపథ్యంలో, ఈ ఇద్దరి లొంగుబాటు రాష్ట్రం మావోయిస్టు పార్టీకి తీరని నష్టాన్ని మిగుల్చనుంది.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
Top Leader Couple Surrenders
"ఆపరేషన్ కగార్’ తో సీపీఐ (మావోయిస్టు) పార్టీని లేకుండా చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మరణించారు.దీంతో పార్టీకి చెందిన కొందరు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ప్రశాంత జీవనం వైపు అడుగులు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఓ వైపు పోలీసుల ఒత్తిడి, ప్రభుత్వ పునరావాస విధానాల ప్రభావంతో చాలామంది దళ సభ్యులు ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ‘పోరు కన్నా ఊరు మిన్న’ కార్యక్రమం ద్వారా మావోయిస్టులను సమాజంలో కలపడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Also Read : స్పెర్మ్ కౌంట్ త్వరగా పెరగాలంటే ఈ జ్యూస్ తాగండి.. వరదలా పారుతాయి!
ఇవాళ సాయంత్రం రామగుండం సీపీ ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్న, ఆత్రం అరుణ లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్‌గా ఆత్రం లచ్చన్న కొనసాగుతుండగా.. బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ ఉన్నారు. ఈ హఠాత్ పరిణామంతో మావోయిస్టు పార్టీకి లోటేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
Also Read : బెడ్రూంలో స్పై కెమెరా.. ఏడ్చేందుకు గ్లిజరిన్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్‌లు!
ramagundam | adilabad district | Maoist surrender | surrender | maoists-in-india | Chhattisgarh Maoists | maoists news