ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి | Maoist | RTV
ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి | Maoist attacks are being provoked again and they shot a person and releases a letter about the reason for it | RTV
ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి | Maoist attacks are being provoked again and they shot a person and releases a letter about the reason for it | RTV
కర్ణాటక మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుడు విక్రమ్ గౌడ ఎన్కౌంటర్లో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం పోలీస్, మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అతడు మరణించినట్లు హోం మంత్రి జి.పరమేశ్వర చెప్పారు. విక్రమ్ కోసం 20 ఏళ్లుగా వేట సాగిందన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరు జనాన్లకు కూడా గాయాలయ్యాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల ఘటనతోపాటు హైడ్రా తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఆపాలనిహెచ్చరించారు. అధికార ప్రతినిధి జగన్ పేరుతో రిలీజైన లేఖ సంచలనం రేపుతోంది.
మవోయిస్టు రహిత దేశమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ‘సల్వాజుడుం’ పేరుతో మొదలైన దాడి ఇప్పుడు ‘ఆపరేషన్ కగార్ 2026’గా కొనసాగుతోంది. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని, వారంతా ఏజెన్సీ పల్లెల్లో షెల్టర్ పొందాలని చూస్తున్నారనే డౌట్ తో ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
అబూజ్మడ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసులను హతమార్చేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప అడవుల్లో బీరు సీసాల్లో ఐఈడీ మందుపాతరలను పాతిపెట్టారు. వాటిని గుర్తించి భద్రతాబలగాలు పేల్చేశాయి.