/rtv/media/media_files/2024/12/06/pdj5ZM4Gycm3evGhAwvt.jpg)
బీజేపీ నేతలే టార్గెట్ గా ఛత్తీష్‍గడ్ మావోయిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఛత్తీష్‍గడ్ రాష్ట్రంలో ఇద్దరు మాజీ సర్పంచ్‌లను మావోయిస్టులు హత్య చేశారు. వారి మృతదేహాలపై కరపత్రాలు వదిలి వెళ్లారు. బీజేపీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారకపోతే చంపేస్తామని ఆ కరపత్రంలో రాశారు. బీజేపీ నేతలను టార్గెట్ చేసి మావోయిస్టులు బెదిరిస్తున్నారు. ఆ పార్టీ నేతలే టార్గెట్‌గా మావోయిస్ట్ దళాల దాడులు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి : మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్!
డిసెంబర్ 6న బీజేపీ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ సర్పంచ్‌లను గొంతుకోసి చంపారు. బీజేపీని వీడకుండే మరణశిక్ష విధిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు మావోయిస్టులు. ఈ చర్యపై బైరాంఘడ్, గంగళూరు ఏరియా కమిటీలపై భద్రతా బలగాలకు అనుమానం వ్యక్తమైతుంది. ఛత్తీస్ ఘడ్ సీఎం విష్ణుదేవ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ
ఇది కూడా చదవండి : నేను అడిగితేనే షిండే అలా చేశారు.. ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు
భద్రతాబలగాలతో సీఎం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. బీజాపూర్‌లోని జీడిపల్లి బేస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలైయ్యాయి.
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం