సుక్మాలో భారీ ఎన్ కౌంటర్.. సంబరాల్లో మునిగితేలిన పోలీసులు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. 10 మంది మృతులను గుర్తించిన పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. గొప్ప విజయం సాధించామంటూ డీఆర్ జీ బృందాలు సంబరాలు చేసుకున్నాయి. By srinivas 23 Nov 2024 | నవీకరించబడింది పై 23 Nov 2024 07:24 IST in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Encounter: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. 10 మంది మృతులను గుర్తించిన పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. గొప్ప విజయం సాధించామంటూ డీఆర్ జీ బృందాలు సంబరాలు చేసుకున్నాయి. గడిచిన 11 నెలల్లో 207 మంది.. ఈ మేరకు సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో పది మంది మావోయిస్టులను హతమార్చినందుకుగాను పెద్దయెత్తున విజయోత్సవం జరుపుకున్నాయి డీఆర్ జీ బృందాలు. ఇందులో డిఆర్ జి సైనికులతోపాటు సీఆర్ పీ ఎఫ్ బృందాలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. అయితే మొదటిసారిగా ఆడి పాడిన జవాన్ల విజువల్స్ RTV చేతికి అందాయి. ఇక మావోయిస్టులపై భద్రత బలగాలు పైచేయి సాధిస్తు వస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గడిచిన 11 నెలల్లో 207 మంది మావోయిస్టులను మట్టు పెట్టినట్లు బస్తర్ ఐ జి సుందర్‌రాజ్ తెలిపారు. ఇది కూడా చదవండి: Allergy: ఇంటి చిట్కాలతో అలెర్జీని సులభంగా పోగొట్టుకోండి మృతుల వివరాలు.. 21 లక్షల రివార్డుతో 6 మంది నక్సలైట్లను గుర్తించారు: 1. మడకం (దుధి) మాసా, వయస్సు సుమారు 42 సంవత్సరాలు, సుక్మా జిల్లా, భండార్‌పదర్ పోలీస్ స్టేషన్‌లో నివాసం. సౌత్ బస్తర్ డివిజన్ MI ఇంచార్జ్ + ప్లాటూన్ నం. 04, 08 ఇంఛార్జ్, DVCM రివార్డ్ 08 లక్షలు2. దుధి హంగీ, భర్త దుధి మాసా, వయస్సు సుమారు 35 సంవత్సరాలు, సుక్మా జిల్లా, భండార్‌పదర్ పోలీస్ స్టేషన్‌లో నివాసం. ప్లాటూన్ నంబర్ 04 పార్టీ మెంబర్ రివార్డ్ 02 లక్షలు3. లఖ్మా మద్వి, వయస్సు సుమారు 25 సంవత్సరాలు, జిలోద్‌గడ్డ పోలీస్ స్టేషన్ నివాసి, పమేడ్ జిల్లా, బీజాపూర్. డివిజన్ స్మాల్ యాక్షన్ టీమ్ కమాండర్/ACM రివార్డ్ 05 లక్షలు4. భేజ్జీ జిల్లా సుక్మాలోని దంతేష్‌పురం పోలీస్ స్టేషన్‌కు చెందిన మడ్కం జీతు. ప్లాటూన్ నంబర్ 04 పార్టీ మెంబర్ రివార్డ్ 02 లక్షలు5. కుమారి మడకం కోసి నివాసి గంగరాజ్‌పాడ్ పోలీస్ స్టేషన్ కొంటా జిల్లా సుక్మా (ఛత్తీస్‌గఢ్) ప్లాటూన్ నంబర్ 04 పార్టీ సభ్యుల బహుమతి 02 లక్షలు6. కోవాసి కేసా నివాసి, జిలోద్‌గడ్డ పోలీస్ స్టేషన్, పమేడ్ జిల్లా, బీజాపూర్. ప్లాటూన్ నంబర్ 04 పార్టీ సభ్యుడు (మాసాస్ గార్డ్) రివార్డ్ 02 లక్షలు. ఇది కూడా చదవండి: Hydra: పర్మిషన్ ఉంటే ఇళ్ళు కూల్చము–హైడా రంగనాథ్ #chattisaghad #encounter #maoist మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి