టార్గెట్ పోలీస్.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఏం చేశారంటే?
ఛత్తీస్‌గఢ్ లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. తర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుడం అటవీప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. దీంతో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి.
ఛత్తీస్‌గఢ్ లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. తర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుడం అటవీప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. దీంతో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి.
కోవర్టులపై మావోయిస్టులు కన్నెర్రజేస్తున్నారు. సొంత సభ్యుల నుంచే పోలీసులకు సమాచారం అందుతుందనే కారణంలో వారిపై అంతర్గత నిఘా పెట్టారు. నిజ నిర్ధారణ తర్వాత ప్రజాకోర్టులో పలువురికి క్షమాభిక్ష పెట్టారు. మరికొందరికి మరణ శిక్ష విధించారు.
ఛత్తీస్‌గడ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టులు మందుపాతరతో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. ఘటనలో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని సిలిగేర్ - టేకుగూడెం రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఛత్తీస్ ఘడ్ అడవుల్లో శుక్రవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య బీకరపోరు జరిగింది. ఇరు వర్గాలు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు జరుపుకున్నారు. ఇందులో 5గురు మావోయిస్టులు మృతి చెందగా.. 3గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.
మావోయిస్టులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట సంచలన లేఖ విడుదల చేశారు.ప్రధాని మోదీ, అమిత్ షా, విష్ణు దేవ్ సాయి, విజయ్ శర్మ ఆదేశాలతోనే మావోయిస్టులపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ మరణహోమానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ హెచ్చరించారు.
పార్లమెంట్ ఎన్నికలకు చర్ల మండల వ్యాప్తంగా 36 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 60 శాతం పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉండటంతో భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగుతోంది.
సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన మాజీ మావోయిస్టు ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లా జిల్లా అబూజ్మడ్ అటవీప్రాంతంలో భద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.