Maoist: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ ఘడ్ నారాయణపూర్ లో భారీ డంపు బయటపడింది. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో సోన్‌పూర్-కోహ్కమెటా ప్రాంతంలో ఆయుధ సామాగ్రితోపాటు నిత్యవసర సరుకుల డంప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్, వెల్డింగ్ గ్యాస్ సిలిండర్, ఫోల్డబుల్ చైర్, వెపన్ మేకింగ్ మెషిన్ తోపాటు ఇతర సామగ్రి డంపులో భద్రపరిచినట్లు వెల్లడించారు. దీని ఆధారంగా పరిసరప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారని, ఈ డంప్ ఆధారంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు భద్రతాబలగాలు అనుమానిస్తున్నాయి. అలాగే కూంబింగ్ మరింత ముమ్మరం చేయగా.. మావోయిస్టులను వీలైనంత త్వరగా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్.. ఇదిలా ఉంటే.. తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 9న బంద్ పాటించాలంటూ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖను విడుదల చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప అడవుల్లోని పోకలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తన పేరుతో మీడియాకు గురువారం లేఖను విడుదల చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9వ తేదీన తెలంగాణలో బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. నవంబర్ 30న చెల్పాక పంచాయతీలోని ఓ వలస ఆదివాసీ గ్రామంలో ఏడుగురు సాయుధులను అధీనంలోకి తీసుకుని దగ్గరి నుంచి అతి కిరాతకంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి చెప్పారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు