14 ఏళ్ల తర్వాత ఉలిక్కిపడ్డ ఓరుగల్లు.. మావోయిస్టుల దారెటు? 14 ఏళ్ల తర్వాత ఓరుగల్లు ఉలిక్కిపడింది. మావోయిస్టు-పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. తెలంగాణలో తలదాచుకోవాలని చూస్తున్న మావోయిస్టులకు భద్రతా బలగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల దారెటు అనేది చర్చనీయాంశమైంది. By srinivas 01 Dec 2024 | నవీకరించబడింది పై 01 Dec 2024 16:23 IST in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి Maoist: మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుస ఎన్ కౌంటర్లలో పార్టీ కేడరు ఉక్కిరిబిక్కిరవుతోంది. కీలక నేతల వ్యూహాలు బెడిసికొడుతుండటంతో భారీ ప్రాణ నష్టం జరుగుతోంది. మరోవైపు ప్రజల్లో అటు పార్టీలోనూ పోలీసుల కోవర్టులు పెరిగిపోవడం మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవలే చత్తీష్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరగగా తాజాగా తెలంగాణలోనూ మరో ఏడుగురు మావోయిస్టులను పోలీసులు కాల్చి చంపడం సంచలనం రేపుతోంది. దండకారణ్యంలో మిలటరీ బలగాలు జల్లడపడుతుండటంతో తెలంగాణ, ఏపీలో తలదాచుకోవాలని చూస్తున్న మావోయిస్టులకు పోలీసులు ఊహించని షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్ పల్లిలో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా పెట్టి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు. ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు.. పీఎల్ జీఏ (ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలకు ఒక్కరోజు ముందే ఎన్ కౌంటర్ జరగడం మావోయిస్టులకు భారీ దెబ్బ పడింది. పీఎల్ జీఏ ఏర్పడి 24 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలకు పిలుపునిచ్చింది. ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు వెలిశాయి. వారోత్సవాలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్ కౌంటర్ జరగడం సంచలనం రేపుతోంది. తెలంగాణ వైపు మావోయిస్టుల చూపు.. ఇక జనవరిలో ఆకురాలే కాలం మొదలుకానుండగా ఆత్మరక్షణ కోసం మావోయిస్టు కీలక నేతలు తమ వ్యూహాలను మారుస్తున్నారు. కీలక నేతలతోపాటు పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణ వైపు ఫోకస్ పెడుతున్నారు. గోదావరి తీర ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నాలుగైదేళ్లుగా వివిధ కమిటీల పేర్లతో కొత్త రిక్రూట్‌మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండు వారాలుగా గోదావరి తీరం వెంట గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తు్న్నాయి. వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో చిన్న టీమ్‌లుగా ఏర్పడి.. తెలంగాణలోని భద్రాద్రి, ములుగు అటవీ గ్రామాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా ఏవోబీ బార్డర్ తోపాటు ఇప్పుడు తెలంగాణలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఉండటంతో మావోయిస్టుల దారెటు? అనేది ఆసక్తికరంగా మారింది. వృద్ధులైన పార్టీ కేడరు లొంగిపోతుందా? లేక ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటారా అనేది చర్చనీయాంశమైంది. 14 ఏళ్ల తర్వాత భారీ ఎన్ కౌంటర్.. ఇక 14 ఏళ్ల తర్వాత ఓరుగల్లులో ఇదే భారీ ఎన్ కౌంటర్. కాగా ఏటూరునాగారం ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు తాడ్వాయి, గోవిందరావుపేట, ఏటూరునాగారం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పోలీసులు గాలింపు చర్యలు మరింత ఉద్ధృతం చేశారు. ప్రధాన రహదారులపై సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ప్రతికారం తీర్చుకునే అవకాశం ఉన్నందున సరిహద్దు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఇది కూడా చదవండి: VRO వ్యవస్థపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ 11 వేల మందికి బాధ్యతలు! తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టగా ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 8 మంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళ సభ్యలు మృతి చెందినట్లు చెబుతున్నారు. మృతుల్లో కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు(43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్(22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్( 23) ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Pushpa 2 : బాబోయ్.. 'పుష్ప2' టికెట్ రేట్ 3 వేలా? #encounter #maoist మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి