Delhi Elections 2025: మనీశ్ సిసోడియా ఓటమి
మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేవలం 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమిని చవిచూశాడు. సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న సంగతి తెలిసిందే.
మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేవలం 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమిని చవిచూశాడు. సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న సంగతి తెలిసిందే.
లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలో వెల్లడైంది. ఈ రిపోర్టు లీకైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎన్నికల వేళ కాగ్ రిపోర్టు బయటపడటం చర్చనీయాంశమవుతోంది.
సీనియర్ నేత మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలు తనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించారు.ఈ విరాళం ఢిల్లీలో ఉద్యోగ, విద్యా పురోగతికి ఉపయోగపడుతుందని తెలిపారు.
జైల్లో ఉన్నప్పుడు తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ వ్యక్తులు బెదిరించేందుకు యత్నించారని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. పార్టీలో చేరకుంటే చంపేస్తామన్నారని పేర్కొన్నారు. కోర్టు ముందు కేజ్రీవాల్ గురించి చెబితే తనను కాపాడుతామన్నారని చెప్పారు
ఎన్డీయే అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వ తీరుకు ఆటంకం కల్పిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు.ఇది ప్రజాస్వామ్యానికి భారమని.. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయడమే మేలని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందని అన్నారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. 17 నెలల తరువాత ఇంట్లో టీ తాగుతున్నానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా నిన్న లిక్కర్ స్కాం కేసులో ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు.
TG: కవిత త్వరలో జైలు నుంచి బయటకు రానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియాకు బెయిల్ రావడమే. కాగా త్వరలో కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఆశ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది.
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. కాగా ఈ కేసులో సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరి 26న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 17 నెలలుగా సిసోడియా జైలులో ఉన్నారు.