ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వ తీరుకు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాంటి పదవి ప్రజాస్వామ్యానికి భారమని.. దాన్ని రద్దు చేయడమే మేలని పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ ఎన్నికల్లో గెలిచిన నేతలు, గవర్నర్ మధ్య జరుగుతున్న వాగ్వాదం వల్ల ఢిల్లీలో బ్యూరోక్రాట్లు ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరంగా మారుతోంది. అసలు రాష్ట్రాలకు గవర్నర్ పదవి ఎందుకు ?. ఎన్నికైన నాయకులతో ప్రమాణం చేయించడానికేనా ?. ఇలాంటి పని ఇతరులతో కూడా చేయించవచ్చు. దీన్ని రద్దు చేయడమే మేలని’ సిసోడియా అన్నారు.
పూర్తిగా చదవండి..Manish Sisodia: గవర్నర్ పదవి రద్దు చేయాలి.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
ఎన్డీయే అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వ తీరుకు ఆటంకం కల్పిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు.ఇది ప్రజాస్వామ్యానికి భారమని.. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయడమే మేలని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Translate this News: