Manish Sisodia: సిసోడియాను అలా జైల్లో ఉంచలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఎక్సైస్ పాలసీ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అలా నిరవధికంగా జైల్లో ఉంచలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఆయనపై మోపినటువంటి అభియోగాలను ట్రయల్ కోర్టులో ఎప్పుడు వాదనలు వినిపించడం ప్రారంభిస్తారని.. సీబీఐ, ఈడీల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ ఎస్.వి రాజును ధర్మాసనం ప్రశ్నించింది. సిసోడియాను ఇలా నిరవధికంగా జైల్లో ఉంచలేరని.. కేసులో ఒకసారి అభియోగంపత్రం దాఖలైతే దానిపై వెంటనే వాదనలు మొదలవ్వాల్సిందేనని తెలిపింది.