ఢిల్లీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలు తనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జంగ్‌పుర నియోజకవర్గం నుంచి సిసోడియా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు తనకు దీని ద్వారా సాయం చేయాలని కోరారు. Also read: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన '' నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నను. మీ మద్దతు వల్లే ఇన్నేళ్లు విజయం సాధించాను. ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ సహకారం కావాలని కోరుతున్నాను. నాకు ఆర్థిక సాయం చేయండి. మీరు అందించే విరాళం ఢిల్లీలో ఉద్యోగ, విద్యా వ్యవస్థ పురోగతికి ఎంతగానో ఉపయోగపడుతుందని'' సిసోడియా తెలిపారు. Also Read: భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లికొడుకు! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా 17 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఆయన బెయిల్‌పై విడుదయ్యారు. ప్రస్తుతం పట్పర్‌గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన..ఈసారి జరగబోయే ఎన్నికల్లో జంగ్‌పుర నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే తనకు ఆర్థిక సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. Also Read: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాము అధికారంలోకి వస్తే.. వృద్ధుల కోసం సంజీవని స్కీమ్(సీనియర్ సిటిజెన్లకు ఉచిత వైద్యం), మహిళా సమ్మాన్ యోజన (18 ఏళ్లు దాటిన ప్రతీ మహిళకు రూ.2100 ఆర్థిక సాయం) పథకం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అర్చకులు కూడా నెలకు రూ.18000 గౌరవ వేతనం ఇచ్చే స్కీమ్ తీసుకొస్తామని ప్రకటించారు. Also Read: 2024లో దారుణంగా పతనమైన రాజకీయ నేతలు వీళ్లే..