/rtv/media/media_files/2025/02/08/xwAPWYm1CLnOn0Wnn4DA.jpg)
Arvind Kerjiwal, Manish sisodia and Satyendra Jain Lost in Election
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ అగ్రనేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ కూడా ఓటమి చవిచూశారు. ఇప్పటికే అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఆప్ అగ్రనేతలు ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన కేజ్రీవాల్ 3 వేల ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ గెలుపొందారు.
Also Read: సున్నాలో కాంగ్రెస్ హ్యాట్రిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్
జంగ్‌పుర స్థానం నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ మనీశ్ సిసోడియా.. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక షాకుర్ బస్తీ నుంచి బరిలోకి దిగిన సత్యేంద్ర జైన్ 19 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ గెలిచారు. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్లు ముగ్గురు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన వారే. 2022 మే 31న ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్‌ను లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. 2023 ఫిబ్రవరి 26న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు.
Also Read: కేజ్రీవాల్ను ఓడించిన ఘనడు... ఎవరీ పర్వేష్ వర్మ?
అలాగే 2024 మార్చి 21న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. వీళ్లు ముగ్గురు విచారణలో భాగంగా కొన్ని నెలల పాటు జైల్లోనే గడిపారు. గత ఏడాదే ఈ ముగ్గురు బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఈ ముగ్గురు కీలక నేతలు కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉండగా కల్కాజి స్థానం నుంచి పోటీ చేసిన ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై కేవలం 900 ఓట్ల తేడాతో గెలిచారు.
Also Read: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ