ఇకనుంచి భిక్షాటన చేసేవారికి డబ్బులిస్తే జైలుకే !
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు. యాచకులకు ఎవరైనా డబ్బులిస్తే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు. యాచకులకు ఎవరైనా డబ్బులిస్తే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి దొంగతనం కేసులో 15ఏళ్ల బాలుడితో పాటు అతడి నానమ్మను పోలీసులు లాఠీలతో చితకబాదారు. తలుపులు మూసి మూకుమ్మడిగా చిత్రహింసలు పెట్టారు. దాడి వీడియో వైరల్ అవుతుండగా.. SP రంజన్ దీనిపై విచారణకు ఆదేశించారు.
ఎన్నికల ప్రచారంలో మోడీని లేపేస్తామంటూ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన చెన్నైలోని ఎన్ఐఏ ఆ కాల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరునున్నారనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా కమల్‌నాథ్ తన ఎక్స్ బయోలో కూడా కాంగ్రెస్ పేరును తొలగించారు. ఆయనతో పాటు తన కొడుకు నకుల్ నాథ్ కూడా బీజేపీలో వెళ్తారనే రూమర్స్ వస్తున్నాయి.
మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. గోవా తీసుకెళ్తా అని చెప్పి.. చివరి నిమిషంలో భర్త అయోధ్యకు తీసుకెళ్లాడని ఓ భార్య విడాకులకు అప్లై చేసింది. తనను మంచిగా చూసుకోవడం లేదని ఆయన సొంత కుటుంబసభ్యులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆరోపించింది.
మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజర్యయారు. అలాగే ఈరోజునే ఛత్తీస్‌గడ్‌లో విష్ణు దేవ్ సాయి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఈరోజు ముఖ్యమంత్రి ఎంపికపై కీలక భేటీ జరగనుంది. సాయంత్రం భోపాల్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్‌ను కొనసాగిస్తారా లేదా కొత్త వారికి అవకాశమిస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి కుక్క పిల్లను నేలకోసి కొట్టిన ఘటన వైరల్ అవ్వడంతో.. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. ఇలాంటి వాటిని సహించకూడదని.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఎక్స్‌లో స్పందించారు. చివరికి పోలీసులు ఆ నిందుతుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ముగ్గురు స్నేహితులు కార్లో వెళ్తుడంగా.. ఓ వ్యక్తిని కారు నుంచి బయటకు తోసేసి ఏకంగా 25 కిలోమీటర్ల వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లడం కలకలం రేపింది. తీవ్ర గాయాలపాలైన అతడు మృతి చెందాడు. పోలీసులు నిందుతుల్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.