Heart Attack While Dancing: పాపం.. డాన్స్ చేస్తుండగానే ఎలా జరిగిందో చూడండి.. యువతి వీడియో వైరల్!

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన పరిణీత జైన్ అనే యువతి సోదరి సంగీత్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆమె హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

New Update
heart attack death

heart attack death

Heart Attack While Dancing:  ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటుతో (Hear Attack) మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డాన్స్ చేస్తూ, తింటూ, వాకింగ్ చేస్తూ, జిమ్ చేస్తూ ఇలా రకరకాల సందర్భాల్లో కన్ను మూసి తెరిచేలోపు గుండెపోటుకు బలవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి  ఓ విషాద ఘటనే మధ్యప్రదేశ్ లోని విధిశా జిల్లాలో జరిగింది. 

Also Read: Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?

డాన్స్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ | Heart Attack While Dancing.. 

అయితే  మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన పరిణీత జైన్ అనే యువతి సోదరి సంగీత్ ఫంక్షన్ లో స్టేజ్ పై డాన్స్ వేస్తుండగా.. ఒక్కసారిగా  కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించిన లాభం లేకపోయింది. అప్పటికే ఆమె హార్ట్ ఎటాక్ తో (Hear Attack)  మరణించినట్లు  వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ పెళ్లి వేడుకల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సోదరి సంగీత్ ఫంక్షన్ లో ఎంతో ఆనందంగా, సరదాగా డాన్స్ వేసిన కూతురు ఇక లేదని తెలియడంతో కుటుంబమంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  గతంలో పరిణితి సోదరుడు కూడా 12 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించాడట. ఇలా ఇద్దరు పిల్లలు గుండెపోటుతో చనిపోవడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. 

Also Read: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి

Also Read: Sankranthiki Vasthunam: వావ్! అప్పుడే టీవీలో వెంకీ మామ 'సంక్రాంతికి వస్తున్నాం'..! నవ్వులే నవ్వులు

Also Read:  కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు