సాధారణంగా రోడ్డు పక్కన, ఆలయాల్లో లేదా ఇతర ప్రదేశాల్లో యాచకులు భిక్షాటన చేస్తుంటారు. ప్రజలు ఇచ్చే డబ్బునుంచే వాళ్లు తమ అవసరాలు తీర్చుకుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం మాత్రం ఇకనుంచి అలాంటి పరిస్థితులు ఉండవు. యాచకులు లేని నగరంగా ఇండోర్‌ను మార్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే అక్కడి జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు. Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి అంతేకాదు యాచకులకు ఎవరైనా సాయం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బులిచ్చేవాళ్లపై ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేస్తామని ప్రకటించారు. జనవరి 1, 2025 నుంచి ఈ రూల్స్ అమలు చేస్తామని పేర్కొన్నారు. యాచకులు కనిపిస్తే వాళ్లకి సాయం చేయొద్దని.. పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇండోర్ కలెక్టర్ ఆశిశ్ సింగ్ ఈ విషయాలను వెల్లడించారు. ఇదిలాఉండగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ.. యాచకులు లేని నగరంగా మార్చాలనే లక్ష్యంతో దేశంలో 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పాటు పలు నగరాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఇందులో భాగంగానే భిక్షాటన కార్యకలాపాలపై ఇండోర్ అధికారులు ఫోకస్ పెట్టారు. భిక్షాటన చేసేవాళ్లలో కొందరికి పక్కా ఇళ్లు ఉన్నాయని.. మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు గుర్తించారు. Also read: సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక ముఠాలు చాలామందిని యాచక వృత్తిలో దించుతున్నట్లు తెలిసిందని పైలట్ ప్రాజెక్టు అధికారి దినేశ్ మిశ్రా తెలిపారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. భిక్షాటన చేసే వాళ్లని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా దేశంలో అత్యంత పరిశుభ్రత నగరాల జాబితాలో కొన్నేళ్లుగా ఇండోర్ నిలుస్తూ వస్తోంది. కేంద్రం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వరుసగా దక్కించుకుంటోంది. మళ్లీ ఇప్పుడు యాచకులు లేని నగరంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. Also Read: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం