Viral Video: చిరుతపులితో సెల్ఫీలు..ఓరి..మీ వేషాలో.. ఎగిరి తంతే ఏట్లో పడతారు!
మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో పలువురు గ్రామస్థులు చిరుతపులితో సెల్ఫీలు దిగిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఆరోగ్యం బాగోని చిరుతపులి తోక తొక్కుతూ, వీపుపై ఎక్కుతూ కొంతమంది ఇక్లెరా ప్రవర్తించిన తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం చిరుతపులి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. భోపాల్లోని వాన్ విహార్లో చిరుతపులికి చికిత్స అందిస్తున్నారు.