/rtv/media/media_files/2025/03/06/cyTQvH47fFwWcWRjeeB8.jpg)
madyapradesh Photograph: (madyapradesh )
Viral video: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో ఠాగూర్ మూవీ సీన్ రిపీట్ అయింది. కొంతమంది డాక్టర్లు, ప్రైవేట్ ఆస్పత్రులు డబ్బుల కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. కనీసం మానవత్వం చూపించకుండా పైకం పిచ్చితో దారుణాలకు పాల్పడుతున్నారు. చనిపోయిన శవాల మీద పేలాలు ఏరుకుంటున్న సంఘటనలు ఎన్నో తారసపడుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా అతను కోమాలోకి వెళ్లాడంటూ డ్రామా మొదలుపెట్టారు. అతన్ని బతికించాలంటే భారీగా ఖర్చు అవుతుందని, పేషెంట్ కుటుంబాన్ని డబ్బులకోసం వేధించారు. అయితే అనుకోకుండా ఆ పేషెంట్ ఐసీయూ నుంచి బయటకు రావడంతో అసలు బాగోతం బయటపడింది.
Also Read: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి చేసుకున్న రమ్మీ
डॉक्टर्स ने मरीज को हॉस्पिटल में भर्ती किया और फ़ैमिली वालो को बोला के तुम्हारा भाई कोमा में चला गया है ।
— H̤🅰️ⱤVÉÈ (@Entidoto) March 5, 2025
और हॉस्पिटल वाले पैसे की डिमांड करने लगे ।
फिर अचानक से पेशेंट गुलूकोस की बॉटल की नाली तोड़ के बाहर आ गया ।
घटना मध्य प्रदेश गीता देवी हॉस्पिटल रतलाम की है । pic.twitter.com/Vr4ft0J808
గీతాదేవి ఆసుపత్రిలో నాటకీయ సంఘటన..
ఈ మేరకు మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలోని గీతాదేవి ఆసుపత్రిలో ఈ నాటకీయ సంఘటన చోటుచేసుకుంది. వైద్యులు రోగిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలని డాక్టర్లను వేడుకున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా బిల్లులు చెల్లించారు. అయితే గత రెండు రోజులుగా ఆ యువకుడు కోమాలోకి వెళ్లాడని కుటుంబ సభ్యులకు చెప్పారు.
Also Read: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!
ఆసుపత్రి సిబ్బంది డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న పేషెంట్ అకస్మాత్తుగా గ్లూకోజ్ బాటిల్ తోనే బయటకు వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆస్పత్రి సిబ్బందిపై మండిపడుతున్నారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.