Beggars: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం యాచకులు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కీలక ప్రకటన చేసింది. భిక్షాటన చేస్తూ కనిపించే వారి గురించి సమాచారం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సూచించింది. సమాచారం అందించిన వారికి రూ.వెయ్యి నగదు అందిస్తామని ప్రకటించింది. దీంతో అధికారులకు వందల సంఖ్యలో ఫొన్‌కాల్స్ వస్తున్నాయి. Also Read: BPSC పేపర్ లీక్ వ్యవహారం.. ప్రశాంత్ కిషోర్ జైలుకు తరలింపు ఈ సందర్భంగా ఇండోర్ జిల్లా కలెక్టర్ మాట్లాడారు. '' నగరంలో భిక్షాటన చేస్తున్నవారి గురించి మాకు సమాచారం ఇస్తే రూ.1000 నగదు బహుమతిగా ఇస్తామని జనవరి 2న ప్రకటన చేశాం. ప్రజలు ఫొన్ చేసేందుకు ఓ నంబర్ కూడా ఇచ్చాం. నాలుగు రోజుల్లోనే దాదాపు 200 వరకు కాల్స్ వచ్చాయి. మాకు వచ్చిన కాల్స్‌కు సంబంధించి వివరాలను విచారిస్తున్నాం. వీటిలో 12 మంది సరైన సమాచారం ఇచ్చారు. మిగితావారి వివరాలు కూడా పరిశీలిస్తున్నామని'' తెలిపారు. Also Read: ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి ఇదిలాఉండగా ఇండోర్ నగరం యాచకులు లేని నగరంగా మార్చేందుకు ముందుడుగులు వేస్తోంది. ఇప్పటికే యాచకులకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా, వారికి ఇతర వస్తువులు అందించినా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. గత 4 నెలల్లో ఇప్పటివరకు 400 మంది యాచకులను పునరావాస కేంద్రాలకు పంపించారు. అలాగే మరో 64 మంది చిన్నారులను పిల్లల సంరక్షణ సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు. Also read: రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు! Also Read: మావోయిస్టుల కట్టడికి రూ.5,601 కోట్లు.. కేంద్రం వ్యూహం ఇదే!