Sex chatting case: పరాయి పురుషులతో శృంగారం ముచ్చట్లు.. ఆ కేసులో భార్యలకు షాక్ ఇచ్చిన హైకోర్టు!

పరాయి మగాళ్లతో పెళ్లైన మహిళల శృంగార ముచ్చట్ల గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన సెక్స్ లైఫ్ గురించి మరోకరితో చాటింగ్ చేస్తే ఏ భర్త భరించలేడని చెప్పింది. భర్త ఆరోపణలపై భార్య సవాల్ చేసిన పిటిషన్ కొట్టేసి విడాకులు మంజూరు చేసింది. 

New Update
sex chatting

MadhyaPradesh High Court key comments on married women sex chatting case

Sex chatting case: పెళ్లైన మహిళలు పరాయి పురుషులతో శృంగార ముచ్చట్లాడటం గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన సెక్స్ లైఫ్ గురించి మరో మగాడితో చాటింగ్ చేస్తే ఏ భర్త భరించలేడని చెప్పింది. భర్త ఆరోపణలపై భార్య సవాల్ చేసిన పిటిషన్ కొట్టేస్తూ విడాకులు మంజూరు చేసింది. 

అసభ్యకరంగా వాట్సాప్ సంభాషణలు..

ఈ మేరకు 2018లో వివాహం చేసుకున్న ఓ వ్యక్తి ఇటీవల తన భార్యపై ఫిర్యాదు చేశాడు. పెళ్లి తర్వాత ఆ మహిళ తన మొబైల్‌లో పాత ప్రేమికులతో మాట్లాతుందని, వాట్సాప్ సంభాషణలు అసభ్యకరంగా ఉన్నాయని ఆరోపించారు. మగ స్నేహితులతో సెక్స్ లైఫ్ గురించి చాటింగ్ చేస్తోందని, తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో భర్తనే తనపై క్రూరత్వానికి పాల్పడ్డాడంటూ ఆమె ఫ్యామిలీ కోర్టులో కంప్లైంట్ చేసింది. ఫ్యామిలీ కోర్టు విడాకుల అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో అతను హైకోర్టుకు ఫిర్యాదు చేయగా.. జస్టిస్ వివేక్ రుషియా, గజేంద్ర సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. వివాహమైన తర్వాత భార్య లేదా భర్త తమ స్నేహితులతో అసభ్యకరమైన సంభాషణలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. 


Also Read: తమిళనాడులోనూ లిక్కర్ స్కామ్.. మొత్తం వేయి కోట్లు.. షాకింగ్ విషయాలు!

ఏ భర్త సహించడు..

'భార్య ఇతరులతో అసభ్యకరమైన చాటింగ్‌లు చేస్తుంటే ఏ భర్త కూడా సహించడు. వివాహానంతరం భార్యాభర్తలిద్దరికీ మొబైల్, చాటింగ్, ఇతర మార్గాల ద్వారా స్నేహితులతో సంభాషించడానికి స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆ సంభాషణ స్థాయి మర్యాదగా, గౌరవంగా ఉండాలి. ప్రత్యేకించి వ్యతిరేక లింగంతో ఉండే సంబంధం జీవిత భాగస్వామికి అభ్యంతరం కలిగించకుండా ఉండాలి' అని పేర్కొంది. ఇక ఎరికైనా అభ్యంతరం ఉన్నప్పుడు అలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తే అది ఖచ్చితంగా ఇతర భాగస్వామికి మానసిక క్రూరత్వాన్ని కలిగిస్తుందని కోర్టు తెలిపింది. 

Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్‌ ..లక్షలాది కొబ్బరికాయలతో...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు