Hyderabad Rain: హైదరాబాద్లో కుండపోతగా వాన.. పలు ప్రాంతాలు జలమయం!
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లితోపాటు పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. మరో 2 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వానకు తడుస్తూనే గణపతికి పూజలు చేస్తున్నారు భక్తులు.