మనుషులా? పశువులా?శ్రీచైతన్య మేనేజ్మెంట్ కు చుక్కలు చూపించిన నేరెళ్ల శారద! హైదరాబాద్ లోని మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో మీరు మనుషుల్లా నడుచుకుంటున్నారా అంటూ యాజామాన్యం పై విరుచుకుపడ్డారు. By Bhavana 01 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad : కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకండి...వసతులు ఏర్పర్చకుండా విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నారెంటీ...అంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలేజీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్న ఛైర్మన్ శారద ఈ తనిఖీలు చేపట్టారు. కాలేజీ ముందు కారు ఆగగానే కాలేజీ లోపల ఎందుకు లాక్ చేశారో చెప్పాలని ఆమె కాలేజీ సిబ్బందిని నిలదీశారు. ఈ క్రమంలోనే ఆమె కాలేజీ హాస్టల్ భవనం, తరగతి గదులను పరిశీలించి కాలేజీ యాజమాన్యం తీరు పై అసహనం వ్యక్తం చేశారు. భవనం పై నుంచి లీకేజీ నీరు భోజనంలో పడిందని చెప్తే ఏమీ కాదు తినండని విద్యార్థినులకు ఉచిత సలహా ఇస్తారా? ఇరుకు గదుల్లో ఎలాంటి వెంటిలేషన్ లేదు, వాష్ రూమ్స్ కూడా సరిగా లేవు, చెత్తా చెదారం పేరుకుపోయిన చోటే విద్యార్థినులకు భోజనం పెడుతున్నారా అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేసిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు.గత కొన్ని రోజులుగా శ్రీచైతన్య మహిళా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినిలకు సంబంధించిన సమస్యలు పలు మీడియాలో రావడం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్న కమిషన్… pic.twitter.com/4sAhlf0dEM — Sharada Nerella (@sharadanerella) September 30, 2024 ఇలాంటి ఇరుకు గదుల్లో మీరైతే ఉంటారా అంటూ ఆమె సిబ్బందిపై విరుచుకుపడ్డారు.ఐదు ఫ్లోర్లు ఉన్న భవనంలోని అన్ని గదుల్లోనూ ఇదే పరిస్థితి ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. విద్యార్థినులతో పాటు మిమ్మల్ని కూడా ఆరు నెలల పాటు ఈ హాస్టల్ రూమూల్లోనే ఉంచితే అప్పుడు వారికి ఎదురయ్యే బాధలు ఏంటో తెలుస్తాయని అన్నారు. పిల్లలతో మీరు మనుషుల్లా నడుచుకుంటున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమైనా సమస్యలున్నా, యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమని సంప్రదించవచ్చని విద్యార్థులకు మహిళా కమిషన్ ఛైర్మన్ భరోసా ఇచ్చారు. గతవారం నిర్మల్ జిల్లా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారామె. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. రిజిస్టర్లలను తనిఖీలు చేసి ఎంతమంది విద్యార్థులున్నారని ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు ఛైర్మన్ నేరెళ్ల శారద. Also Read: అమెరికా సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన రష్యా ఫైటర్ జెట్! #madhapur #sri-chaitanya-college #nerella-sharada మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి