Trump Tower: హైదరాబాద్‌లో బిల్డింగ్స్ కడుతున్న ట్రంప్.. ఎక్కడంటే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ భారతదేశంపై కన్నేసింది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాల్లో ట్రంప్ టవర్లను ఆ సంస్థ నిర్మించింది. ఇప్పుడు హైదరాబాద్, నోయిడా, బెంగళూరుతో పాటు పూణెలో మరో 6 టవర్లను నిర్మించడానికి రెడీ అయింది.

New Update
Trump Tower

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంవైపు ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు అమెరికా అధ్యక్షునిగా రెండవ సారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన నిర్మాణ సంస్థ హైదరాబాద్‌పై కన్నేసింది. హైదరాబాద్‌లో రెండు భారీ టవర్లను.. ట్రంప్ టవర్ల పేరుతో నిర్మాణం చేయడానికి సిద్ధం అయింది. దీని బట్టి చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా ఏ లెవెల్లో అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. 

Also Read : ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన

హైదరాబాద్‌తో పాటు మరికొన్ని నగరాల్లో

భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాల్లో ట్రంప్ టవర్లను ఆ సంస్థ నిర్మించింది. ముంబై, కోల్‌కతా, గుర్గావ్, పూణె వంటి ప్రాంతాల్లో ట్రంప్ టవర్స్ నిర్మించింది. ఇక ఇప్పుడు మరో ఆరు టవర్లను నిర్మించేందుకు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. అందులో హైదరాబాద్, నోయిడా, బెంగళూరుతో పాటు పూణెలో టవర్లను నిర్మించడానికి రెడీ అయింది. 

Also Read :  సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

ట్రంప్ టవర్ల సంఖ్య మొత్తం 10

వీటితో ట్రంప్ టవర్ల సంఖ్య మొత్తం 10కి చేరుకోనుంది. వీటి నిర్మాణం కోసం ట్రంప్ నిర్మాణ సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో స్థానిక మంజీరా గ్రూప్‌తో కలిసి జంట టవర్లు నిర్మించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

2.92 ఎకరాల భూమి

దీనికోసం మాదాపుర్‌లోని ఖానాపుర్ ఏరియాలో 2022లో హెచ్ఎండీఏ వేసిన ఆక్షన్‌ (వేలం)లో దాదాపు 2.92 ఎకరాల భూమిని ట్రంప్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఈ భూమికి సంబంధించి అన్ని అనుమతులు కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్‌కి ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని ఆ సంస్థ భావిస్తోందట. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కంపెనీ దాదాపు 27 అంతస్తుల్లో 4 బెడ్‌రూంలు, 5 బెడ్‌రూంల అపార్టుమెంట్లతో నిర్మించనుంది. అందులో వీటి విస్తీర్ణం విషయానికొస్తే.. 4 బెడ్‌రూంల అపార్టుమెంట్ల విస్తీర్ణం 4 నుంచి 5వేల చదరపు అడుగులు ఉంటుంది. అదే సమయంలో 5 బెడ్‌రూంల అపార్టుమెంట్ల విస్తీర్ణం 6వేల చదరపు అడుగులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందులో ఒక చదరపు అడుగు ధరను దాదాపు రూ.13 వేలుగా నిర్ణయించాలని అప్పట్లో భావించారు. అప్పటి లెక్క ప్రకారమే 4బెడ్‌రూంల అపార్టుమెంట్‌ ధర రూ.5.5 కోట్లు కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు