అతి వేగానికి ఇద్దరు యువకులు బలయ్యారు. మాదాపూర్ పరిధిలో బైక్ మీద వస్తున్న ఇద్దరు యువకులు డివైడర్ ఢీకొని అదుపు తప్పి కింద పడిపోయారు. తాగి, వేగంగా బండి నడిపి... అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో బుల్లెట్ బైక్‌పై వేగంగా ఇచ్చిన ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు హాస్పిటల్ తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఇద్దరు యువకులూ బోరబండకు చెందిన ఆకాన్ష్, రఘుబాబులుగా గుర్తించారు. మితిమీరిన స్పీడే కాకుండా బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం కూడా తాగి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ యాక్సిడెంట్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్.. బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి.. హైదరాబాద్ - మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన బుల్లెట్ బైక్ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిబైక్ నడుపుతున్న వ్యక్తి… pic.twitter.com/ebLjSuNVrM — Telugu Scribe (@TeluguScribe) December 27, 2024 హైదరాబాద్ నిండా వేగా రైవ్ చేయొద్దు, తాగి బండి నపొద్దు అంటూ సైన్ ఓరడులు ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడిక్కడ కంట్రోల్ చేస్తూనే ఉంటారు. అయినా కూడా వయసలో ఉన్న ఉడుకు రక్తాలకు బుర్రెక్కవు. తాగిన తర్వాతబండి నడపకూడదన్నా కామన్ సెన్స్ కూడా ఉండదు. ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్, నిర్లక్ష్య , డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలపై దూసుకెళ్లడంతో ప్రమాదాలు జరిగి చాలా ప్రాణాలే గాలిలో కలుస్తున్నాయి. ఇందులో ఎక్కువగా యువకులే ఉంటున్నారు. Also Read: స్వర్గంలో రతన్ టాటా, కలాం, శాస్త్రితో మన్మోహన్.. వైరల్ అవుతున్న AI ఫొటోలు!