ఒళ్ళు గగుర్పొడిచే వీడియో.. అర కిలోమీటర్ స్కూటర్ ని ఈడ్చుకెళ్ళిన కారు..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హైవే పై కారు స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో స్కూటర్ కారు బానెట్‌లో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ కారు డ్రైవర్ పట్టించుకోకుండా అర కిలోమీటర్ వరకు స్కూటర్‌ను ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
car accident

car accident

Viral Video :ఈ మధ్య కొంతమంది ఆకతాయిలు రోడ్ల పై అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ లతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. పోనీ..  డ్యాష్ ఇచ్చిన తర్వాత గాయపడిన వ్యక్తిని కనీసం కాపాడాలనే మానవత్వం కూడా లేకుండా పోతుంది. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది. హైవే పై స్పీడ్ గా వెళ్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది. ఆ తర్వాత బైక్ ను అర కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

స్కూటర్ కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు 

మీడియా కథనాల ప్రకారం.. లక్నోలోని పిజిఐ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యాక్సిడెంట్ జరిగింది. స్కూటర్ పై ఇద్దరు వ్యక్తులు మోహన్‌లాల్‌గంజ్‌కు వెళ్తుండగా వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కింద పడిపోయారు. ఈ క్రమంలో స్కూటర్ కారు బానెట్‌లో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ కారు ఆపకుండా స్కూటర్ ను అర కిలోమీటర్ వరకు లాకెళ్ళాడు కారు డ్రైవర్. పక్కనే వెళ్తున్న వాహన దారులు చెబుతున్న వినిపించుకోకుండా అలాగే వెళ్ళాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును వెంబడించి అడ్డుకున్నారు. 

Also Read: నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్

Also Read :  భూపాలపల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం.. భయాందోళనలో గ్రామస్థులు

పోలీసులు కారు డ్రైవర్ ను ప్రయాగ్‌రాజ్‌కు చెందిన చంద్రప్రకాష్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన స్కూటర్‌ డ్రైవర్, మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

Advertisment
తాజా కథనాలు