BIG BREAKING: కొత్త మంత్రుల పేర్లు ఇవే.. అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల పేర్లు ప్రకటించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వారికి నా అభినందనలు అన్ని ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల పేర్లు ప్రకటించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వారికి నా అభినందనలు అన్ని ట్వీట్ చేశారు.
ప్రభుత్వం కొత్తగా ప్రమాణస్వీకారం చేయనున్న ముగ్గురి పేర్లు రాజ్ భవన్‌కు పంపింది. ఈరోజు మధ్యాహ్నం 12.19 నిమిషాలకు వారి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. వీరితోపాటు మరో 2రోజుల తర్వాత డిప్యూటీ స్పీకర్ రామ్ చంద్రు నాయక్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచింది. 11మంది మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.
మాగంటి గోపీనాథ్ అనుచరుడు సర్థార్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన మనస్థాపం చెంది ఆరోగ్యం క్షీణించింది. 3రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. బాబా ఫసయుద్ధీన్ వేధింపుల కారణంగా సర్థార్ ఇంటిపై నుంచి దూకి చనిపోయాడు.
బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గురువారం గుండెపోటు రావడంతో గోపీనాథ్ ను AIG ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్ పై చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న BRS ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్‌ను KCR పరామర్శించనున్నారు. ఆదివారం హాస్పిటల్‌కు పెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. గురువారం ఛాతీతో మాగంటి ఆసుపత్రికి చేరారు.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. పది మంది శుక్రవారం సాయంత్రం నదిలో స్నానానికి వెళ్తే అందులో ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
జగద్గిరిగుట్ట రింగ్బస్తీలోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి (27) అనే యువకుడు సజీవదహనం అయ్యాడు. మొబైల్ పేలి షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.