రాజ్ భవన్‌కు కొత్త మంత్రుల పేర్లు.. మధ్యాహ్నం ప్రమాణస్వీకారం

ప్రభుత్వం కొత్తగా ప్రమాణస్వీకారం చేయనున్న ముగ్గురి పేర్లు రాజ్ భవన్‌కు పంపింది. ఈరోజు మధ్యాహ్నం 12.19 నిమిషాలకు వారి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. వీరితోపాటు మరో 2రోజుల తర్వాత డిప్యూటీ స్పీకర్ రామ్ చంద్రు నాయక్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

New Update
new Ministers

తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ప్రమాణస్వీకారం చేయనున్న ముగ్గురి పేర్లు రాజ్ భవన్‌కు పంపింది. ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం 12.19 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. వీరితోపాటు మరో రెండు రోజుల తర్వాత డిప్యూటీ స్పీకర్ రామ్ చంద్రు నాయక్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్షణ్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రుగా కేబినేట్‌లోకి తీసుకుంటున్నారు.  

మాల సామాజికవర్గం నుంచి వివేక్‌ వెంకటస్వామి, మాదిగ సామాజికవర్గం నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్ సామాజికవర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి కేబినెట్‌లో ఛాన్స్ ఇవ్వలేదు. మంత్రివర్గంలో ఎస్టీలకు చోటు లేదు. ఎస్టీలను సంతృప్తి పరచడానికి రామ్ చంద్రు నాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. క్యాబినేట్‌లో ఇప్పటికే నలుగురు రెడ్లు, ఇద్దరు బీసీలు ఉన్నారు. 

raj-bhavan | telangana-government | ministers | telangana cabinet ministers | telangana-cabinet-expansion | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు