Chhattisgarh: కార్మికుల గోళ్లు తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చి..!
ఛత్తీస్గఢ్లోఫ్యాక్టరీలో దొంగతనం చేశారని యజమాని ఇద్దరు కార్మికులను చిత్రహింసలకు గురి చేశాడు.దొంగతనం ఆరోపణతో యజమాని చోటూ గుర్జార్ వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చాడు.
ఛత్తీస్గఢ్లోఫ్యాక్టరీలో దొంగతనం చేశారని యజమాని ఇద్దరు కార్మికులను చిత్రహింసలకు గురి చేశాడు.దొంగతనం ఆరోపణతో యజమాని చోటూ గుర్జార్ వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చాడు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా చెప్పిన విషయం తెలిసిందే.దీని పై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందించి..త్వరలోనే శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా,క్రిమియా పై రష్యా నియంత్రణను గుర్తించడానికి అమెరికా సిద్ధంగా ఉంది.ఈ శాంతి ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి రానుంది.
బంగ్లాదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. హిందూ నేత బాబేశ్ చంద్రను ముష్కరులు కిడ్నాప్ చేసి, కొట్టి చంపేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నలుగురు వ్యక్తులు ఆయనను ఇంటి వద్ద నుంచే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
అస్సాంలోని నాగావ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదైంది. భూకంపం ప్రభావం నాగావ్, దాని పరిసర ప్రాంతాలలో కూడా కనిపించింది.తీవ్రత తక్కువగా ఉండటం వల్ల, ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.
కెనడాలో దుండగుడి కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థినిప్రాణాలు కోల్పోయారు.హర్సిమ్రత్ రంధవా బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.
హైదరాబాద్‌లో ఈదురు గాలులు వణికించాయి. గాలుల ధాటికి అబిడ్స్ లో భవన నిర్మాణంపై నుంచి భారీ క్రేన్ కూలిపోయింది. పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ నెల 29 నుంచి మే 4 వరకు తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు.
అమెరికాలో వీసాల రద్దు,స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల నుంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ తొలగింపులకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని ఏఐఎల్ఏ చెప్పింది.