Ganja: అనకాపల్లి To రాజస్థాన్.. భారీగా పట్టుబడ్డ గంజాయి!
ఏపీలో భారీగా గంజాయి పట్టుబడింది. అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం అడ్డరోడ్డులో 110 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఒరిస్సాలో గంజాయి కొనుగోలు చేసి, వాహనాలకు నెంబరు బోర్డులు మార్చి ఏపీ మీదుగా రాజస్థాన్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.