Red Sandalwood: తిరుమలలో పుష్పరాజ్ లు రెచ్చిపోయారు. శిలాతోరణం వద్ద ఓ కారులో ఎర్ర చందనం దుంగలు తరలిస్తూ అటవిశాఖ అధికారులకు పట్టుబడ్డారు. అయితే కారులో వెళ్తున్న దుండగులు అటవీ శాఖ అధికారులు కారు ఆపి తనిఖీలు చేపడుతుండగా హల్ చల్ చేశారు. పారిపోయేందుకు ప్రతయత్నించారు. కానీ పోలీసులు వారిని పట్టుకుని బంధించారు. కారులో ఏ గ్రేడ్ దుంగలు.. ఇక కారులోని వెనుక సీటులో గ్రేడ్ ఏ ఎర్రచందనం దుంగలు లభ్యం అయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు తనికీ చేస్తున్న సమయంలో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు. గమనించిన సిబ్బంది అతనని అదుపులోకి తీసుకున్నారని, ఎర్రచందనం దుంగలతో పాటు కారును సైతం సీజ్ చేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: Pawan: ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవండి.. విజయవాడ బుక్ ఫెయిర్‌లో పవన్ ఇదిలా ఉంటే.. ఇటీవలే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న పలువురుని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. కోలీవుడ్ హీరో సూర్య నటించిన "సింగం" మూవీ తరహాలు వేరోక రాష్ట్రం వెళ్లి అక్కడి పోలీసుల సాయంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని పాటన్‌లో దాదాపు 5 టన్నుల బరువున్న 155 ఎర్రచందనం దుంగల్ని ఏపీ రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఎర్ర చందనం దుంగల్ని ఏపీ నుంచి గుజరాత్ వైపుకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే గుజరాత్ పోలీసులను సంప్రదించి వారి సాయంతో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: Clarke:అతనొక్కడే ఆసీస్ బౌలర్లను ఉ**చ్చ పోయిస్తున్నాడు..మైఖేల్ క్లార్క్ అరెస్టైయిన వారి నుంచి భారీ ధర పలికే ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటితో పాటు నిందితుల నుంచి ఒక బ్రెజ్జా కారు సైతం స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన స్మగ్లర్లను గుజరాత్‌లోని పాటన్ కోర్టులో ప్రవేశ పెట్టి వారిని ట్రాన్సిట్ వారంట్‌పై ఏపీకి తరలిస్తామని టాస్క్ ఫోర్స్ డీఎస్పీ షరీఫ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఎర్ర చందనం దుంగల్ని తిరుపతికి తరలిస్తామని తెలిపారు.