Ganja: ఏపీలో భారీగా గంజాయి పట్టుబడింది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం అడ్డరోడ్డులో 110 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఓ లేఅవుట్‌లో ఉన్న కారు గుర్తించిన పోలీసులు దానిని తనిఖీ చేయగా.. 5 కిలోలతో 22 ప్యాకెట్లు లభ్యమైనట్లు తెలిపారు.
బోర్డులు మార్చి రవాణా..
వాహనాలకు నెంబరు బోర్డులు మార్చి ఒరిస్సా నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్ కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు. ఇక రాజస్థాన్ చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. వారివద్ద నుండి 2 సెల్ ఫోన్స్, కారు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఎల్.రామకృష్ణ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tirupati: తిరుమలలో పుష్పరాజ్‌ల హల్‌చల్.. భారీగా పట్టుబడ్డ దుంగలు!
ఇదిలా ఉంటే.. తిరుమలలో పుష్పరాజులు రెచ్చిపోయారు. శిలాతోరణం వద్ద ఓ కారులో ఎర్ర చందనం దుంగలు తరలిస్తూ అటవిశాఖ అధికారులకు పట్టుబడ్డారు. అయితే కారులో వెళ్తున్న దుండగులు అటవీ శాఖ అధికారులు కారు ఆపి తనిఖీలు చేపడుతుండగా హల్ చల్ చేశారు. పారిపోయేందుకు ప్రతయత్నించారు. కానీ పోలీసులు వారిని పట్టుకుని బంధించారు. ఇక కారులోని వెనుక సీటులో గ్రేడ్ ఏ ఎర్రచందనం దుంగలు లభ్యం అయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు తనికీ చేస్తున్న సమయంలో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు. గమనించిన సిబ్బంది అతనని అదుపులోకి తీసుకున్నారని, ఎర్రచందనం దుంగలతో పాటు కారును సైతం సీజ్ చేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Romantic Tips: శృంగారంలో రెచ్చిపోవాలా.. పాలలో ఇది కలిపి తాగితే అరుపులే..!