BCCI: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఊహగానాలు ఊపందుకుంటున్నాయి. వరుసగా విఫలమవుతున్న హిట్ మ్యాన్‌కు ఆస్ట్రేలియాతో సిరీస్ లాస్ట్ అనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముగియగానే వీడ్కోలు పలకబోతున్నాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో అంశం తెరపైకొచ్చింది. మొదటి టెస్టుకు సారథ్య బాధ్యతలు వహించిన బుమ్రాకు కాకుండా మళ్లీ విరాట్ కోహ్లీకే టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చేందుకు బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ కంటే కోహ్లీ బెటర్..
ఈ మేరకు రోహిత్‌తో పోలిస్తే విరాట్ మైదానంలో చాలా చురుకుగా ఉండటమే ఇందుకు కారణం. కాగా ఈ సిరీస్ మొదటి టెస్టులో కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ కంటే కోహ్లీ బెటర్ అని, నాలుగో టెస్టులోనూ కింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలర్లకు సూచనలివ్వడంపై మెనేజ్ మెంట్ కూడా సానుకూలంగా స్పందించినట్లు బీసీసీఐ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ క్రమంలో చివరి టెస్టుకు విరాట్ సారథ్యంలో ఆడిస్తే బాగుటుందని భావిస్తున్నారట. రోహిత్ కు విశ్రాంతిని ఇచ్చి ఎలాగైనా చివరి టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం లేదంటే అతను తప్పుకోగానే కోహ్లీ కే మళ్లీ సారథ్య బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Murder: న్యూ ఇయర్ విష్ చేసినందుకు విద్యార్థిని చంపేశారు!
విరాట్ అలాంటి వాడు కాదు..
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ క్లార్క్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ గురించి తనకు బాగా తెలుసని, మ్యాచ్ ముగిశాక కొన్‌స్టాస్‌తో వివాదం గురించి మాట్లాడినట్లు క్లార్క్ తెలిపాడు. అందుకే విరాట్ గొప్ప వ్యక్తి అని పేర్కొంటున్నట్లు చెప్పాడు. విరాట్ సారీ చెప్పాడో లేదో తెలీదు. కానీ విరాట్ దారుణమైన మనిషి కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇది కూడా చదవండి: Madras High Court: మనమందరం సిగ్గు పడాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు