Telangana Jagruthi: ఏప్రీల్ 24న జాగృతి కీలక సమావేశం...పార్టీ ఆనౌన్స్ చేసే అవకాశం

రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్‌ 24.25 తేదీల్లో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ విధివిధానాల రూపకల్పనకు కవిత ప్లాన్ చేస్తున్నారు.

New Update
M LC Kalvakuntla Kavitha

Telangana Jagruti kavitha

Telangana Jagruthi: రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(kalvakuntla-kavitha) ఏప్రిల్‌ 24.25 తేదీల్లో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. ఇన్నాళ్లు జాగృతిలో చేరడానికి వెనుకడుగు వేసిన పలువురు ఔత్సహిక నేతలు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కవిత(Telangana Jagruthi Kavitha) కు కోర్టు క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో కవిత వెంట నడవడానికి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లో సరైన గుర్తింపునకు నోచుకోని నేతలు జాగృతివైపు చూస్తున్నారు. ఈ క్రమంలో జాగృతి నాయకులు, నూతన కార్యకర్తలు, కవితకు మద్దుతుగా నిలుస్తున్న బీసీ సంఘాల నేతలు, ఇతర మద్దతుదారులను కలుపుకుని కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ విధివిధానాల రూపకల్పనకు కవిత ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏప్రిల్‌ 24.25 తేదీల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. - new political party

Also Read :  తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. సీనియర్లకు నిరాశే

Jagruti's Key Meeting On April 24

కవితపై మద్యం విధానం కుంభకోణం కేసు కొట్టుడుపోవడంతో జాగృతి కార్యకర్తలు సైతం ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఔత్సహిక నేతలు జాగృతి వైపు చూస్తున్నారు. వారందరినీ సమన్వయం చేస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనేలా ఈ సమావేశాన్ని మేడ్చల్‌ పరిధిలోని అద్వైత కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే వచ్చే జనాన్ని బట్టి కన్వెన్షన్‌ సెంటర్‌ సరిపోతుందా లేదంటే ఓపెన్‌ గ్రౌండ్‌ లో ఏకంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడమా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రానట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కవితతో టచ్‌ లోకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా వారి చేరికతో పాటు పార్టీ పేరు, పార్టీ విధివిధానాలు ప్రకటించేందుకు ఈ సమావేశం కీలకంగా మారే అవకాశం ఉంది.  

Also Read :  విరోష్‌ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

Advertisment
తాజా కథనాలు