Shiv Pratap Shukla: తెలంగాణ కొత్త గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా.. 9 రాష్ట్రాల గవర్నర్లు మార్పు

దేశంలోని 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ అనూహ్య రాజీనామాతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ్‌ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు.

New Update
BREAKING

BREAKING

దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ అనూహ్య రాజీనామా నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఐదుగురు గవర్నర్లను బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Also Read :  కవిత కొత్త పార్టీ నినాదం ఇదే.. ‘తెలంగాణ ఫస్ట్’

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్‌ప్రతాప్‌ శుక్లా

తెలంగాణ గవర్నర్‌(telangana new Governor) గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ్‌ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించిన జిష్ణుదేవ్‌ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. 1952లో యూపీలోని గోరఖ్‌పుర్‌లో జన్మించిన శుక్లా(Shiv Pratap Shukla), గతంలో మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఫిబ్రవరి నుంచి హిమాచల్ గవర్నర్‌గా ఉన్న ఆయన, ఇప్పుడు తెలంగాణకు రానున్నారు.

బెంగాల్ గవర్నర్ రాజీనామా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ గురువారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకానున్న తరుణంలో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బోస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అయితే, కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే ఈ రాజీనామా జరిగి ఉండవచ్చని సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో సయ్యద్ అటా హస్నైన్‌ను నియమించారు. మొత్తం 9 రాష్ట్రాల్లో మార్పులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read :  పెళ్లిళ్ల వేళ.. భారీగా పడిపోయిన బంగారం ధర.. నేడు ఎంతో తెలుసా?

Advertisment
తాజా కథనాలు