Crime: తల్లిని చంపేందుకే లవ్ ట్రాక్.. జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు?
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అంజలిని చంపేందుకే శివ అనే యువకుడితో పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది.
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అంజలిని చంపేందుకే శివ అనే యువకుడితో పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లోకి గొర్రెలను పంపి యాదవులు వినూత్నంగా నిరసన తెలిపారు. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. గొర్ల కాపరుల సంక్షేమ సంఘం సోమవారం ఉదయం గొర్రెలను పంపారు.
ఒక్క టూవీలర్‌పై వందల్లో చలాన్లు దర్శనమివ్వడంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేశారు. అటువైపుగా వచ్చిన ఓ స్కూటీని ఆపి పెండింగ్ చలాన్లను చెక్ చేయగా 233 చలాన్లు ఉండటంతో షాకయ్యారు.
హైదరాబాద్‌లో ఓ కారు డ్రైవర్ వెనక్కి చూసుకోకుండా డోర్‌ను తెరిచాడు. బైక్‌పై వెళ్తున్న జమీర్ కుటుంబానికి ఆ డోర్‌కు తగిలి వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఫాతిమా అనే మహిళ ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమార్తె ప్రాణాలతో బయటపడింది.
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డుచెప్పాడని కన్నతండ్రిని కడతేర్చారు కసాయిబిడ్డలు. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు కూతుళ్లు.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానిని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలంగాణాకు న్యాయం జరగకపోతే.. లీగల్ ఫైట్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మా ప్రభుత్వానికి రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం తెలిపారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక ఉండకపోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు నోటిఫికేషన్ వచ్చిందన్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక ఆలస్యం కావొచ్చన్నారు.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు FIR నమోదు చేశారు. CM రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని వెంకట్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.