నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి కలకలం | Tiger Spotted at Nagar Kurnool District | RTV
నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి కలకలం | Tiger Threats near Achampet in Nallamala Forest Range and His sightings seen by Villagers while travelling in a Jeep | RTV
ప్రేమను నిరాకరించిందని ఇంటర్ విద్యార్థిని నోట్లో పురుగుల మందుపోసి చంపిన ఘటన కర్నూల్ జిల్లా నగరూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అశ్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డ సన్నీ పారిపోగా పోలీసులు గాలిస్తున్నారు.
కర్నూల్ లో జై భీం మూవీ సీన్ రిపీట్ అయ్యింది. కర్నూల్ త్రీ టౌన్ పోలీసులు ఇద్దరు అనుమానితులను 14 రోజులుగా బంధించి చేయని తప్పును ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుల తల్లిదండ్రులు లాయర్ను ఆశ్రయించడంతో విషయం బయట పడింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసారతో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
వైసీపీ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆదోని జనసేన ఇంచార్జ్ మల్లప్ప మండిపడ్డారు. ఇసుక అమ్మకాల్లో తాను డబ్బు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో తేలుస్తామన్నారు. తప్పు చేస్తుంటే చూస్తూ ఉండడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదన్నారు.
ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా 27 మంది కూలీలు వాగులో చిక్కుకున్నారు. గంజిహళ్లి సమీపంలోని మల్లెల వాగు ప్రవాహం ఎక్కువ ఉండటంతో వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
నంద్యాల జిల్లా అబ్దుల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. బెట్టింగ్ కు బానిసైన కొడుకు చేసిన రూ. 2.40 కోట్ల అప్పు తీర్చలేక తల్లిదండ్రులు ప్రాణాలు తీసుకున్నారు. 10 ఎకరాల భూమి, ఇల్లు, కల్లం అమ్మేసినా కూడా అప్పులు తీరకపోవడంతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.