/rtv/media/media_files/2025/05/01/q5TJrBjycFwjKPictbMF.jpg)
boy cheated transgender
ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు ఎక్కువ అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు అనే కాకుండా ఇద్దరూ కూడా ఇతరులను మోసం చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఇటీవల ఓయువకుడు పెళ్లి చేసుకుంటానని ట్రాన్స్‌జెండర్‌ను మోసం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన గణేష్‌కు 9 నెలల కిందట హసీనా పరిచయం అయ్యింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
మాయమాటలు చెప్పి వలలో వేసుకుని..
ఆమెకు మాయమాటలు చెప్పి మోసం చేసి వలలో వేసుకున్నాడు. చివరకు ఆమెను పెళ్లి చేసుకుని కొద్ది రోజులు తనతోనే ఉన్నాడు. పని మీద ఊరు వెళ్తున్నానని వెళ్లి గణేష్ మళ్లీ రాలేదు. ట్రాన్స్‌జెండర్ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించినా ట్రాన్స్‌జెండర్ ఆదోని వెళ్లి ప్రియుడు ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి
గణేష్ చదువు, అప్పులు కోసం ఆమె రూ.15 లక్షలు ఖర్చు చేసిందని తెలిపింది. నాలుగేళ్ల నుంచి వీరిద్దరికి పరిచయం ఉందని, కానీ ఇప్పుడు తనని వదిలి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ట్రాన్స్‌జెండర్ ఆరోపించింది. తనకి ఆరోగ్యం బాగా లేదని, ఫిట్స్ వస్తుందని వదిలేశాడని తెలిపింది.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!
న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు హిజ్రా నిరసన చేపట్టింది. దీంతో మరో నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఆమెకు మద్దతు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లో గతంలో ఈ ఘటనపై కేసు నమోదు కూడా చేయగా.. ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..