BREAKING: పెను విషాదం.. ఈతకెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి!

కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకోసంవెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటికుంటలో మునిగి చనిపోయారు. మృతులందరినీ ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. 

New Update
V BREAKING

BREAKING: కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకోసంవెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటికుంటలో మునిగి చనిపోయారు. అయితే స్కూల్ సమీపంలో ఉన్న చిన్న నీటికుంటలో ఈతపడేందుకు వెళ్లారు. కానీ ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. మృతి చెందిన పిల్లలను శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మెహబూబ్ గా గుర్తించారు. వీరందురు కూడా స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నారు. ఈ మేరకు  స్థానిక ఎమ్మెల్యే విరూపాక్ష ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అలాగే మృతులను కుటుంబాలను పరామర్శించారు. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు పిల్లలు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పసివాళ్లు తల్లిదండ్రులు గుండెపగిలేలా రోధిస్తున్నారు. 

గోదావరిలో స్నానానికి వెళ్లి.. 

ఇలా విద్యార్థులు ఈతకెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలోనూ పలు చోట్ల చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో పి.గన్నవరం మండలం నాగుల్లంకకు సమీపంలో వశిష్ట గోదావరిలో స్నానానికి అని వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.  వెస్ట్ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంకకు చెందిన నీతిపూడి పౌల్‌కుమార్‌(15), నాగుల్లంకకు చెందిన కేతా ప్రవీణ్‌(16), సానబోయిన సూర్యతేజ (12)  గల్లంతయ్యారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు గోదావరిలో స్నానానికి రాగా.. అందులో ముగ్గురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. 

మరో ఘటన 

మరోసారి గోదావరి నదిలో స్నానానికి వెళ్లి 8 మంది యువకులు గల్లంతయ్యారు. పెళ్లి కోసమని ముమ్మిడివరం మండలం కమినిలంక ప్రాంతానికి వెళ్లిన 11 మంది యువకులు.. స్నానం చేయడానికి గోదావరి నదికి వెళ్లారు. అయితే వారు నీటిలోకి దిగిన చోటు లోతైన ప్రాంతం కావడంతో నీటిలో కొట్టుకుపోయారు. మరో ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారు. గల్లంతైన వారిని  సతీష్‌, మహేష్‌, రాజేష్‌, రోహిత్‌, క్రాంతి, పాల్‌, సాయి, మహేష్ లుగా గుర్తించారు

Also Read: Pakistan Floods: పాకిస్తాన్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 365కు పెరిగిన మృతుల సంఖ్య!

Advertisment
తాజా కథనాలు