HYD: ఇవాళ ఏసీబీ ముందుకు కేటీఆర్
ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు ఇళ్ళ ముదు ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు ఇళ్ళ ముదు ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
కేటీఆర్ ఆదేశాలతోనే విదేశీ కంపెనీకి నిధులు విడుదల చేసినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ ఏసీబీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అరవింద్ స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ఏసీబీ.. ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా కేటీఆర్ ను విచారించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఏసీబీ విచారణలో కేటీఆర్ తో పాటు లాయర్ ను అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. లాయర్ దూరం నుంచి కేటీఆర్ ను చూడొచ్చని తెలిపింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మేఘా కృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేఘా కృష్ణారెడ్డితో క్విడ్ ప్రో కో (ఒకరికొకరు వాటాలు పంచుకోవడం) చేసుకుంటుందని విమర్శలు చేశారు. దమ్ముంటే మేఘాను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సవాల్ చేశారు.
కేటీఆర్ అరెస్టుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మరోసారి మాట్లాడారు. కేసు విషయం తాను చూసుకుంటానని.. కార్యకర్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.నాపై పెట్టింది లొట్టపీసు కేసని దాంతో ఏం కాదంటూ పేర్కొన్నారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇవ్వాళ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, HMDA మజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉండగా.. బీఎల్ఎన్రెడ్డి A3గా ఉన్నారు.
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.