/rtv/media/media_files/2025/02/26/Myz7xBO4w9Q2ffcRsyIw.jpg)
KTR Responds on Delimitation
ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (De-Limitation) అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని భావిస్తే.. ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి తగ్గట్టు చేపట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు పలికారు. ఈ మేరకు దీనిపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం
KCR Supports To CM Stalin
దేశ అవసరాల కోసం కుటుంబ నియంత్రణ అమలు చేసిన దక్షిణ రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు. సౌత్ రాష్ట్రాల పనితీరు పరిగణలోకి తీసుకోకుండా డీలిమిటేషన్ చేయడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని తెలిపారు. కేంద్రం డీలిమిటేషన్‌ను అమలు చేయాలనుకుంటే.. దేశానికి రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యం ఆధారంగా ఉండాలన్నారు. దేశ ప్రగతిలో తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు అందిస్తున్న సహకారాన్ని ఎవరూ విస్మరించలేరని అన్నారు. తెలంగాణ (Telangana) లో దేశ జనాభాలో 2.8 శాతం ఉండి.. జీడీపీకి 5.2 శాతం కన్నా ఎక్కువ భాగస్వామ్యం అందిస్తోందని స్పష్టం చేశారు.
Also Read: ఐడియా అదిరింది గురూ.. కుంభమేళా నీళ్లతో ఊరంతా స్నానం.. సెల్యూట్ చేయాల్సిందే!
Also Read : రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్!
ఇదిలాఉండగా డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించినట్లు చెప్పుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం.. కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయకూడదన్నారు. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన గురించి చర్చించేందుకు డీఎంకే మార్చి 5న అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చిస్తారు ? ఏ నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్.. కవిత మళ్లీ జైలుకు!?