Konda Surekha: నాంపల్లి కోర్టుకు మంత్రి సురేఖ...కోర్టు ఆదేశాలతో...

సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరయ్యారు.ఈ కేసులో నాగార్జున, కేటీఆర్‌ వేర్వేరుగా పరువు నష్టంకేసులు దాఖ‌లు చేశారు.

New Update
ktr-nagarjuna-konda

ktr-nagarjuna-konda

Konda Surekha: సినీ నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కుటుంబం, బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ ఈరోజు నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరయ్యారు. ఈ కేసులో నాగార్జున, కేటీఆర్‌ వేర్వేరుగా పరువు నష్టం కేసులు దాఖ‌లు చేశారు. ఈ క్రిమినల్‌ కేసుల్లో ఎట్టకేలకు మంత్రి కొండా సురేఖ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు రెండు కేసుల్లోనూ ఆమె ముద్దాయి కావడంతో తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలనే నింబంధనలను పాటిస్తూ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విచారణ అనంతరం ఈ నెల 27కు కేసు వాయిదా పడింది.

Also Read:REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!

కేటీఆర్‌, నాగార్జునలపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు

గతేడాది గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌజ్‌లోని బాపూ ఘాట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌, నాగార్జునలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో ఆ వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ అనుచిత వ్యాఖ్యలపై వారిరువురూ వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. సాక్షుల వాంగ్మూలాల్ని, సాక్షాధారాల్ని కోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు వేర్వేరుగా రెండు కేసుల్ని నమోదు చేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కోర్టుకు హాజరుకాలేకపోయినట్టు ఆమె తరఫున న్యాయవాది ఇప్పటివరకు గైర్హాజరు పిటిషన్లను కోర్టుకు దాఖలు చేశారు. తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు నిబంధన విధించడంతో ఆమె కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. కోర్టు ఎదుట హాజరైన పిదప విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

కాగా మంత్రి చేసిన వ్యాఖ్యలను పలు టీవీ ఛానళ్లు, పత్రికలు ఆమె చేసిన వ్యాఖ్యల్ని ప్రసారం చేశాయని,ఆమె నాగార్జున, కేటీఆర్‌లపై వారి పరువుకు భంగం కల్గించేవిధంగా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు ఆమె చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో, ఆడియోలను నిక్షిప్తం చేసిన పెన్‌డ్రైవ్‌ను, ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగ్‌లను సాక్షాధారారులు కోర్టుకు సమర్పించారు. సాక్షుల, సాక్షాధారలను పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టనుంది.

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

Also Read:యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు