KTR Comments: జూపల్లి పదవి ఊస్ట్‌...కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఓ మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ సీఎం కేటీఆర్ అని పొరపాటున వ్యాఖ్యానించారు.దీనిపై కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే జూపల్లిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారన్నారు.

New Update
Jupally Krishna Rao-KTR

Jupally Krishna Rao-KTR

KTR Comments: మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) చేసిన వ్యాఖలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఓ మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ సీఎం కేటీఆర్ అని పొరపాటున వ్యాఖ్యానించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే మంత్రి జూపల్లిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారని సెటైరికల్ పోస్టు చేశారు. 

Also Read: త్వరలో క్యాన్సర్‌కు టీకా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన కేటీఆర్... సంచలన పోస్టు చేశారు.తనను ముఖ్యమంత్రి అనడంపై కేటీఆర్ స్పందిస్తూ.. నా మాటలు గుర్తు పెట్టుకోండి జూపల్లి గారూ.. మీరు చేసిన ఈ తప్పుకు త్వరలోనే మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయం అంటూ తన సోషల్ మీడియా ఖాతా అయిన ఎక్స్ వేదికగా సదరు వీడియోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. 

Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్

నా మాటలను గుర్తుపెట్టుకోండి..

మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనుల గురించి వివరించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేస్తోంది అంటూ.. వాటికోసం నెలకు రూ.6500 కోట్లు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి.. ముఖ్యమంత్రి కేటీఆర్ అని నోరు జారారు. ఆ తర్వాత దానిని సవరిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి అని పలికారు. కాగా జూపల్లి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ ఈ పోస్టును రీట్వీట్ చేశారు. ‘‘నా మాటలను గుర్తుపెట్టుకోండి. ఈ తప్పుకు మంత్రి జూపల్లిని త్వరలో మంత్రివర్గం నుండి తొలగించబోతున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో పలువురు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పేటప్పుడు తడబడిన సందర్భంలో కూడా కేటీఆర్ ఇదే రకమైన సెటైరికల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.అనుకోకుండా వచ్చిన ఆ మాటలపై కాంగ్రెస్ అధిష్టానం నిజంగానే సీరియస్ గా తీసుకుంటుందా.. లేక చూసి చూడనట్టు వదిలేస్తుందా అనేది చూడాలి మరి.  

Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్‌ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్

Also Read: భూకంపం టైంలో పెద్ద శబ్ధం ఎందుకు వస్తుందో తెలుసా?

#ktr #jupalli-krishnarao #congress #brs
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు