/rtv/media/media_files/2025/10/08/ntr-and-krishna-2025-10-08-16-34-39.jpg)
ఒకే కథ, టైటిల్స్ తో తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రమే వివాదాస్పదంగా మారాయి. అలాంటి రచ్చలో ఒకటి 1987లో జరిగింది. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేష్ బాబు ఎంట్రీ ఖారరు అయిపోయింది. వి.మధుసూదనరావు దర్శకత్వంలో మూవీని అనౌన్స్ చేశారు.హీరోయిన్ గా సోనమ్ ను తీసుకున్నారు. బప్పి లహరి సంగీతం అందించగా, పద్మాలయా స్టూడియోస్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించారు.
అప్పటికే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సామ్రాట్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. విజయశాంతి హీరోయిన్ .. కె. చక్రవర్తి సంగీతం అందించారు. ఒకే టైటిల్ తో పోస్టర్లు రిలీజ్ చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద రచ్చ మొదలైంది. టైటిల్ విషయంలో ఎవరూ తగ్గలేదు. చివరకు విషయం సినీ పెద్దలకు వెళ్లడంతో ఇందులో ఎన్టీఆర్, కృష్ణ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
కోర్టు వరకు వెళ్లిన వివాదం
రెండు వైపులా టైటిల్ విషయంలో రాజీ పడకపోవడంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది.కోర్టు తీర్పులో సామ్రాట్ టైటిల్ హక్కులు కృష్ణకు, రమేష్ బాబు సినిమాకు దక్కాయి.కోర్టు తీర్పుతో బాలకృష్ణ సినిమా టైటిల్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా సాహస సామ్రాట్ గా రిజస్టర్ చేయించారు. ఈ టైటిల్ వివాదం అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది.
రమేష్ బాబు నటించిన సామ్రాట్ చిత్రం అక్టోబరు 2, 1987లో రిలీజై పర్వాలేదని అనిపించగా, బాలకృష్ణ నటించిన సాహస సామ్రాట్ 13 ఏప్రిల్ 1987లో విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల నడుమ హీరో సుమన్ నటించిన ప్రేమ సామ్రాట్ 1987 జూన్ 15న రిలీజై సూపర్ హిట్ అయింది. మోహనగాంధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భానుప్రియ హీరోయిన్ గా నటించింది.