AP Crime : కామాంధుడి వేధింపులకు వివాహిత బలి.. పురుగుల మందు తాగి!

ఓ కామాంధుడి వేధింపులకు వివాహిత బలైన ఘటన ఘటన కృష్ణా జిల్లా లోని పామర్రు మండలంలో చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది.

New Update
ap crime

ఓ కామాంధుడి వేధింపులకు(sexual Harassment) వివాహిత(married woman) బలైన ఘటన ఘటన కృష్ణా జిల్లా లోని పామర్రు మండలంలో చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరవోలు ఎస్సీకాలనీకి చెందిన మేడపాటి ప్రవీణ్‌రాజు, వసంత (24) దంపతులకు ఇద్దరు మగ పిల్లలు సంతానం. ప్రవీణ్‌రాజు రాడ్‌ వెల్డింగ్‌ పనులు చేస్తు్ండగా..  వసంత గృహిణి..అయితే కొంతకాలం నుంచి అదే గ్రామానికి చెందిన ప్రైవేటు బస్సు డ్రైవర్‌ మేరుగుమాల పవన్‌ అనే వ్యక్తి వసంతను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇంట్లో విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు గట్టిగానే మందలించారు. అయినప్పటికీ పవన్ నుంచి వేధింపులు ఏ మాత్రం ఆగలేదు.

Also Read :  ప్రేమ పేరుతో కానిస్టేబుల్‌ మోసం..అనుమానస్పదంగా యువతి మృతి

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

ఈ క్రమంలో పవన్‌ ఆగడాలు భరించలేక వసంత శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వసంత కన్నుమూసింది. కన్నతల్లి చనిపోవడంతో ఇద్దరు పిల్లలు బోరున విలపిస్తున్నారు. వసంత ఆత్మహత్యకు కారణమైన పవన్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు పామర్రు- దిగమర్రు నేషనల్ హైవేపై కొమరవోలు ముఖద్వారం వద్ద రాస్తారోకో చేశారు. పామర్రు పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా నిరసన విరమించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పామర్రు ఎస్సై రాజేంద్రప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు.  అనంతరం వసంత మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

Also Read :  గాయకుడు జుబీన్‌ గార్గ్ మృతిలో బిగ్‌ ట్విస్ట్‌.. ఆయనపై విష ప్రయోగం? సంచలన ఆరోపణలు..

యువతి అనుమానస్పదంగా మృతి

మూడు నెలలుగా ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న యువతి అనుమానస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. ఈ ఘటన గద్వాల జిల్లా గట్టు చిన్నోనిపల్లెలో చోటు చేసుకుంది. పాల్వంచకు చెందిన ప్రియాంక చిన్నోనిపల్లెకు చెందిన  రఘునాథ్ గౌడ్ అనే కానిస్టేబుల్‌ అయిన యువకుడితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. సుమారు నాలుగేళ్లుగా వారు ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత యువకుడు ఆమెను దూరం పెట్టడంతో భరించలేకపోయిన ప్రియాంక ఆ యువకుడి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని అడిగింది. దానికి ఆయన నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుటే నిరసనకు దిగింది. గడచిన మూడు నెలలగా  ప్రియాంక కానిస్టేబుల్‌ ఇంటి ఎదుట నిరసన చేస్తోంది.  

తనను ప్రేమించి పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రియాంక గతంలోనే గద్వాల జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రఘునాథ్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు కాగా ఆ యువకుడు జైలుకు వెళ్లి ఇటీవల విడుదల అయ్యాడు. అయితే అప్పటి నుంచి  ప్రియాంక ఆ యువకుడి ఇంటి ఎదుటే దీక్ష కొనసాగిస్తోంది. రెండు రోజుల క్రితం తనను పెండ్లి చేసుకోవాలని మరోసారి కోరగా రఘునాథ్‌ గౌడ్‌  నిరాకరించడంతో ప్రియాంక పురుగుల మందు తాగింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను గద్వాల ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం తిరిగి చిన్నోనిపల్లె గ్రామానికి చేరుకొని రఘునాథ్‌ గౌడ్‌ ఇంటి ఎదుట తిరిగి దీక్ష కొనసాగించింది. ఇవాళ ఉదయం అకస్మాత్తుగా ప్రియాంక మృతి చెందింది. 

Advertisment
తాజా కథనాలు