ఏపీలో విషాదం.. చెరువులో ఏడుగురు విద్యార్థులు గల్లంతు..

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. అందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
Pond 3

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. అందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. లింగయాస్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గన్నవరం మండలం మాదాలవారిగూడెంలోని చెరువులో ఆదివారం ఈతకు వెళ్లారు. 

Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

చెరువులోకి దిగిన అనంతరం ప్రమాదవశాత్తు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు బయటకు తీశారు. మృతులు పాలడుగు దుర్గారావు, జె.వెంకటేష్‌గా గుర్తించారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆంటంకం ఏర్పడుతోంది. ఏడుగురు విద్యార్థులు ఇలా చెరువులో గల్లంతవ్వడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

ఇదిలాఉండగా ఇటీవల శ్రీసత్యసాయి జిల్లాలో కూడా ఈతరు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. హిందూపురంలోని నింకంపల్లికి చెందిన అనీస్ ఖాన్(42) కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అయితే గొల్లపల్లి జలాశయానికి వచ్చి అందులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మరోవైపు పెనుకొండ మండలంలోని అమ్మవారి పల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి(19) అనే మరో యువకుడు ఆదివారం ఓ జలాశయంలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. 

Also Read: బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్

Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు