Rangarajan: ఉక్కుపాదంతో తొక్కేస్తాం.. రంగరాజన్‌పై దాడి చేసిన వారికి మంత్రి కొండా సురేఖ వార్నింగ్!
రంగరాజన్‌పై దాడిని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. సంఘ వ్యతిరేక శక్తులు రాముని పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని అశాంతికి గురిచేసేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.